Tirupati: వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి 8 ప్రత్యేక రైళ్లు

--
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. వేసవిలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ - తిరుపతి వయా వికారాబాద్, గుంతకల్ మార్గంలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి, మే 9 నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ రైళ్లు సనత్‌నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సెడాం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని ఆయన వివరించారు.