Chiranjeevi: 'వేవ్స్‌' స‌మ్మిట్‌కు బ‌య‌ల్దేరిన చిరంజీవి.. ఇదిగో వీడియో

Chiranjeevi Heads to WAVES Summit in Mumbai
 
రేప‌టి (గురువారం) నుంచి నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) కోసం మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ముంబ‌యి బ‌య‌ల్దేరి వెళ్లారు. ముంబ‌యి వెళ్లేందుకు ఆయ‌న‌ బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముంబ‌యి వేదికగా మొదటి ప్రపంచ ఆడియో విజువల్ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)ను ప్రారంభించనున్నారు. ఇది మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం. ఇక్కడ ఆయన మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

Chiranjeevi
WAVES Summit
Mumbai
Narendra Modi
World Audio Visual and Entertainment Summit
Indian Cinema
Telugu Cinema
MegaStar Chiranjeevi
Bollywood

More Telugu News