Basaveshwara: గొప్ప సామాజిక విప్లవకారుడు బసవన్న: కేసీఆర్

KCR hails Basavanna as a great social revolutionary
  • సామాజిక అభ్యుదయవాది బసవేశ్వరుని జయంతి నేడు
  • సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని కేసీఆర్ కితాబు
  • ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్న కేసీఆర్
కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించి పోరాడిన సామాజిక అభ్యుదయవాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు బసవేశ్వరుని జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక సేవను స్మరించుకున్నారు. 

ధార్మిక ప్రవచనాలు, వచన సాహిత్యం, వాటి కార్యాచరణ ద్వారా సమానత్వం కోసం పాటుపడిన గొప్ప సామాజిక విప్లవకారుడు బసవన్న అని కేసీఆర్ కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన దార్శనిక పాలకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నారని అన్నారు. బసవేశ్వరుని ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని చెప్పారు. 
Basaveshwara
Basavanna
KCR
Social Reformer
ViraShiva Lingayat
Social Equality
Religious Preacher
Brs Party
Telangana
India

More Telugu News