KKR: వాళ్లిద్ద‌రూ మంచి మిత్రులు.. కుల్దీప్‌, రింకూల‌ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన కేకేఆర్‌

Rinku Singh and Kuldeep Yadavs Viral Video Explained
  • నిన్న రాత్రి డీసీ, కేకేఆర్ మ్యాచ్  
  • మ్యాచ్ అనంత‌రం రింకూ చెంపపై కుల్దీప్ కొట్టిన వీడియో వైర‌ల్‌
  • కుల్దీప్ బౌలింగ్‌లో రింకూ బౌండ‌రీలు బాద‌డ‌మే దీనికి కార‌ణ‌మంటూ ప్ర‌చారం
  • ఈ ప్ర‌చారాన్ని ఖండించిన కేకేఆర్ 
  • యూపీకి చెందిన వారిద్ద‌రూ మంచి మిత్రులంటూ వీడియో షేర్
మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ), కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం రింకూ సింగ్‌ను కుల్దీప్ యాద‌వ్ చెంప‌పై కొట్టిన‌ట్లు ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. డీసీ స్పిన్న‌ర్ కుల్దీప్ బౌలింగ్‌లో రింకూ బౌండ‌రీలు బాద‌డ‌మే దీనికి కార‌ణ‌మంటూ ప్ర‌చారం కూడా జ‌రిగింది. 

ఈ ప్ర‌చారాన్ని కేకేఆర్ ఖండించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన వారిద్ద‌రూ మంచి మిత్రులు అని తెలిపింది. నిన్న‌టి మ్యాచ్ అనంత‌రం స‌ర‌దాగా ఫొటోకు పోజులిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అటు డీసీ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి ఓన్లీ ప్యార్ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో రింకూను కుల్దీప్ చెంప దెబ్బ‌ కొట్ట‌డం అనేది సీరియ‌స్ కాద‌ని, స‌ర‌దాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌గా తేలిపోయింది. 


KKR
Rinku Singh
Kuldeep Yadav
DC
IPL 2023
Viral Vide Friendship
Uttar Pradesh

More Telugu News