Anitha Vangalapoodi: పవన్ అన్నా... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు: హోంమంత్రి అనిత

Anitha expresses gratitude to Pawan Kalyan
  • సింహాచలం దుర్ఘటన జరిగిన వెంటనే స్వయంగా రంగంలోకి దిగిన హోంమంత్రి అనిత
  • అనితను ప్రశంసించిన పవన్ కల్యాణ్
  • మీ మాటలు ఎంతో ప్రోత్సాహానిచ్చాయన్న అనిత
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా జరిగిన తీవ్ర విషాద ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి వంగలపూడి అనిత రంగంలోకి దిగి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్లిష్ట సమయంలో ఆమె చూపిన చొరవ, బాధ్యతాయుతమైన పనితీరును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. సంక్షోభ సమయంలో హోంమంత్రి అనిత చూపిన చొరవను, ఆమె చేసిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. 

దీనిపై మంత్రి అనిత స్పందిస్తూ పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. "అన్నా, మీ ప్రశంసలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మాటలు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. మీరు చెప్పినట్లుగానే, కూటమి ప్రభుత్వంలో అందరం బాధ్యతగా భావించి వెంటనే చర్యలు చేపట్టాం. సంక్షోభ సమయాల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వ స్ఫూర్తి మాకు మార్గనిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంలో, భక్తులకు ధైర్యం చెప్పడంలో అధికారులు, సిబ్బంది అద్భుతంగా సమన్వయంతో పనిచేశారు. వారికి నా అభినందనలు" అని మంత్రి అనిత పేర్కొన్నారు.
Anitha Vangalapoodi
Pawan Kalyan
Andhra Pradesh Government
Simhachalam Temple Tragedy
Home Minister
Chandrababu Naidu
Disaster Relief
AP Politics
Tragedy Response
Minister Anitha

More Telugu News