Nara Lokesh: కార్యకర్త ఆరోగ్య పరిస్థితి బాగా లేదంటూ ఒకే ఒక్క ట్వీట్... స్పందించిన నారా లోకేశ్

Nara Lokesh Responds to Tweet About Ill Party Worker
  • టీడీపీ సీనియర్ కార్యకర్త శ్రీ హరి గుండె సంబంధిత సమస్య
  • ఆర్థిక సహాయం అందించాలని లోకేశ్ కు నెటిజన్ విజ్ఞప్తి
  • సహాయంపై ఫాలో అప్ చేయాలని తన బృందానికి లోకేశ్ సూచన
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ సీనియర్ కార్యకర్త శ్రీహరి పట్ల మానవతా దృక్పథంతో స్పందించారు. గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న శ్రీహరికి పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త శ్రీహరి గత కొంతకాలంగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవానీ అనే నెటిజన్ ఎక్స్ లో నారా లోకేశ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

తన కార్యాలయం ద్వారా ఈ విషయం తెలుసుకున్న వెంటనే లోకేశ్ స్పందించారు. శ్రీహరి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీకి ఎంతోకాలంగా సేవలందిస్తున్న శ్రీహరి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కేవలం పరామర్శతో సరిపెట్టకుండా, శ్రీహరికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని, ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తన వ్యక్తిగత సిబ్బందిని, పార్టీ బృందాన్ని నారా లోకేశ్ ఆదేశించారు.


Nara Lokesh
TDP
Telugu Desam Party
Senior Party Worker
Heart ailment
Medical Assistance
Twitter
Social Media
Political News
Andhra Pradesh Politics

More Telugu News