K.A. Paul: స్నేహితుడితో కలిసి వాషింగ్టన్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కారులో కేఏ పాల్ షికారు

KA Pauls Tesla Ride in Washington DC
  • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అమెరికా పర్యటన
  • వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ నేత మైఖేల్‌తో ప్రయాణం
  • ఆటోమేటిక్ టెస్లాలో ప్రయాణించిన కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త మైఖేల్‌తో కలిసి అత్యాధునిక టెస్లా ఆటోమేటిక్ కారులో ప్రయాణించారు.

వాషింగ్టన్ డీసీలో రాజకీయంగా, వ్యాపారపరంగా కీలకమైన వ్యక్తి మైఖేల్. ఆయన తన సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కారులో కేఏ పాల్‌ను రోడ్లపై తిప్పారు. కారులో తన స్నేహితుడితో కలిసి ప్రయాణించిన 57 సెకన్ల వీడియోను కేఏ పాల్ తన 'ఎక్స్' ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ, 2002లో తన మిత్రుడు సెనేటర్‌గా ఎన్నికల్లో ఓడిపోయాడని, అయితే దేవుడి మీద నమ్మకం ఉంచాలని తాను సూచించానని అన్నారు.
K.A. Paul
Tesla Self-Driving Car
Washington DC
Michael
Praja Shanti Party
US Trip
Political Leader
Businessman
X (formerly Twitter)
Automobiles

More Telugu News