Chandrababu Naidu: నెల్లూరుపాలెం ఎస్టీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు

Chandrababu Naidu Distributes Pensions in Nellorepalem ST Colony
  • పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
  • ఎస్టీ కాలనీలోని అంకోజి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి
  • కూతురు, కొడుకుకి ప్రభుత్వం తరపున సాయం ప్రకటన
ఈ రోజు ఒకటో తేదీ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 'పేదల సేవలో పింఛన్ పంపిణీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలోని అంకోజి ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అంకోజి కూతురు చలంచర్ల సుస్మితకు ముఖ్యమంత్రి వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆ కుటుంబ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆమె ఐదేళ్ల కూతురుని గురుకుల పాఠశాలలో చేర్పించి, చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఆ కుటుంబంలోని అంకోజి, సుమ కుమారుడుకి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వీరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
Chandrababu Naidu
Pension Distribution
Nellorepalem
ST Colony
Andhra Pradesh
NTR Bharosa
Welfare Schemes
Atmakur
Unemployment
Skill Development

More Telugu News