Nagachaitanya: వేవ్స్ సమ్మిట్ లో మెరిసిన నాగచైతన్య, శోభిత

Nagachaitanya and Shobhita Dhulipala Shine at Waves Summit
  • ముంబై వేదికగా వైభవంగా ప్రారంభమైన వేవ్స్ సమ్మిట్
  • హాజరైన సినీ దిగ్గజాలు, స్టార్లు
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత
ముంబై వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారతీయ వినోద పరిశ్రమ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే నినాదంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది.

ఈ ప్రారంభ వేడుకలకు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా వంటి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యంగా టాలీవుడ్ నుంచి యువ నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాగచైతన్య బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, శోభిత సంప్రదాయ చీరకట్టులో నుదుటన బొట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి తాజా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagachaitanya
Shobhita Dhulipala
Waves Summit
Mumbai
Indian Film Industry
Celebrities
Bollywood
Tollywood
World Audio Visual and Entertainment Summit
Red Carpet

More Telugu News