Amit Shah: ఇది నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఎవరినీ వదిలిపెట్టదు: అమిత్ షా హెచ్చరిక

Amit Shahs Stern Warning Modi Govt Wont Spare Terrorists
  • ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరిక
  • పిరికిపంద దాడులతో గెలిచామని భ్రమ పడవద్దని వ్యాఖ్య
  • ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వమని, ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టీకరణ
  • దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని దృఢ సంకల్పం
  • ఉగ్రవాదానికి పాల్పడిన వారికి తగిన శిక్ష తప్పదని పునరుద్ఘాటన
"పిరికితనంతో చాటుగా వచ్చి దాడి చేసి ఇది తమ గొప్ప విజయమని ఎవరైనా భావిస్తే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఎవరినీ విడిచిపెట్టదు" అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు.

ఉగ్రవాదంపై పోరాటంలో కేవలం 140 కోట్ల మంది భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం భారత్‌కు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. "ప్రపంచంలోని అన్ని దేశాలు సంఘటితంగా ఈ పోరాటంలో భారత ప్రజలతో నిలబడుతున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని అమిత్ షా పునరుద్ఘాటించారు. "ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారికి కచ్చితంగా తగిన శిక్ష లభిస్తుంది" అని ఆయన హెచ్చరించారు. 
Amit Shah
Narendra Modi
India
Terrorism
Home Minister
Government
Warning
Counter-terrorism
National Security

More Telugu News