Ramakrishna: దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్ నిర్మాణ పనులు విజయవంతం కావాలి: ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ

Ramakrishna Seeks Blessings for Amaravatis Reconstruction
  • విజయవాడ వచ్చిన నందమూరి రామకృష్ణ
  • ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం
  • రేపు అమరావతి పునర్ నిర్మాణ పనుల శంకుస్థాపన
  • హాజరుకానున్న ఎన్టీఆర్ తనయుడు
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో అమరావతి పునః నిర్మాణ పనులు విజయవంతం కావాలని దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తనయుడు రామకృష్ణ ఆకాంక్షించారు. అమరావతి పునఃప్రారంభ పనుల శంకుస్థాపనలో పాల్గొనేందుకు ఇవాళ విజయవాడ వచ్చిన రామకృష్ణ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా అర్చకస్వాములు రామకృష్ణకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించి అమ్మవారి శేషవస్త్రాలతో రామకృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజారాజధారి అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ రేపు అమరావతికి వస్తున్నారని, ఆయన పర్యటన విజయంతం కావాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. 

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. 

తెలుగుదేశం పార్టీ, తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రగా ఏపీ రూపుద్దికోవాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలలు సాకారం కావాలని, ప్రజాశీస్సులతో స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని రామకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రామకృష్ణ వెంట రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, వీరమాచనేని శివప్రసాద్ వల్లూరు కిరణ్ తదితరులు ఉన్నారు.
Ramakrishna
Amaravati
Reconstruction
NTR
Andhra Pradesh
Kanakadurga
Vijayawada
Modi
Chandrababu Naidu
Polavaram Project

More Telugu News