Attari Wagah Border: అటారీ-వాఘా స‌రిహ‌ద్దు పూర్తిగా మూసివేత‌

Attari Wagah Border Completely Closed
  
భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉన్న అటారీ-వాఘా స‌రిహ‌ద్దును తాజాగా పూర్తిగా మూసివేశారు. గ‌డిచిన వారం రోజులు ఈ బోర్డ‌ర్ గుండా జ‌నం రెండు దేశాల‌కు ప్ర‌యాణించారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో దాయాది దేశంపై క‌ఠిన ఆంక్ష‌లకు దిగిన భార‌త్‌... మ‌న దగ్గ‌ర ఉన్న పాకిస్థానీల‌ను వారి దేశానికి వెళ్ల‌గొట్టింది. ఇందు కోసం వివిధ వీసాదారుల‌కు విధించిన గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ క్ర‌మంలోనే అటారీ-వాఘా స‌రిహ‌ద్దును తాజాగా పూర్తిగా క్లోజ్ చేసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

అటారీ-వాఘా స‌రిహ‌ద్దు ప్ర‌స్తుతం పూర్తిగా మూసివేశారు. ఇరుదేశాల ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగించే వీలులేదు అని సంబంధిత అధికారులు తెలిపారు. భార‌త్‌లో ఉన్న 125 మంది పాక్ పౌరులు బుధ‌వారం స్వ‌దేశానికి వెళ్లిపోయారు. దీంతో గ‌డిచిన ఏడు రోజుల్లో భార‌త్‌ను వీడిన పాకిస్థానీల సంఖ్య 911కు చేరిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పాక్‌లో ఉన్న 15 మంది ఇండియ‌న్స్ బుధ‌వారం స‌రిహ‌ద్దు దాటి స్వ‌దేశానికి చేరుకున్న‌ట్లు స‌మాచారం.   

ఇక‌, ఏప్రిల్ 22వ తేదీన పహ‌ల్గామ్‌లో పాశ‌విక దాడి త‌ర్వాత పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్లాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. భార‌త్‌ను వీడి వెళ్లే 12 కేట‌గిరీల వీసాలు క‌లిగి ఉన్న ప్ర‌జ‌ల‌కు డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 27 వ‌ర‌కు పెట్టారు. అలాగే మెడిక‌ల్ వీసాదారుల‌కు ఏప్రిల్ 29 వ‌ర‌కు డెడ్‌లైన్ విధించారు. 
Attari Wagah Border
Attari-Wagah Border Closure
India-Pakistan Border
Pakistanis deported from India
Pulwama attack aftermath
Visa deadline
India Pakistan Relations
Border Security
International Relations

More Telugu News