Narendra Modi: వెలగపూడిలో మోదీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Modis Grand Welcome in Velagapudi
  • రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్న ప్రధాని మోదీ
  • సభా ప్రాంగణానికి ప్రధానితో పాటు బయల్దేరిన సీఎం, డిప్యూటీ సీఎం
  • 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న పీఎం
ఆంధ్రుల కలల రాజధాని అమారావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. కేరళ తిరువనంతపురం కార్యాక్రమంలో పాల్గొన్న ప్రధాని... అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు అధికారిక విమానంలో చేరకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఘన స్వాగతం పలికారు. ప్రధానిని వీరు సభాస్థలికి తీసుకెళ్లారు. 

కాసేట్లో ప్రధాని రాజధాని అమరావతి పనులతో పాటు, 18 ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సభాస్థలి ఇప్పటికే లక్షలాది మందితో కిటకిటలాడుతోంది. సభకు పెద్ద సంఖ్యలో అమరావతి రైతులు హాజరయ్యారు. తమ కల సాకారమవుతోందని వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Velagapudi
Capital City
Project Inauguration
Indian Politics

More Telugu News