Nara Lokesh: వంద పాకిస్థాన్ లు వచ్చినా బదులిచ్చేందుకు ఒక్క మిస్సైల్ ఉంది.. దాని పేరు...!: నారా లోకేశ్

Lokeshs Strong Stance on Pakistan We Have One Missile Its Name is Modi
  • అమరావతి పనుల పునఃప్రారంభ సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • ఉద్వేగపూరితంగా ప్రసంగించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళి
  • ఉగ్రదాడులతో భారత గడ్డపై గడ్డి కూడా పీకలేరని వ్యాఖ్యలు
అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు తన సంతాపం తెలియజేశారు. 100 పాకిస్థాన్ లు వచ్చినా, దీటుగా బదులిచ్చేందుకు మన వద్ద ఒక్క మిస్సైల్ ఉంది... ఆ మిస్సైల్ పేరు నమో (నరేంద్ర మోదీ) అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

గడ్డి కూడా పీకలేరు!

"వారు భారతగడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. సింహం ముందు ఆటలు ఆడకూడదు... ఆడితే ఏమవుతుంది... మన నమో దెబ్బకు వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్థాన్ మిస్సింగ్ కావడం ఖాయం. ఈరోజు పాక్ ఆర్మీలో పనిచేసేవారు కొందరు రాజీనామాలు చేశారు, కొందరు సెలవు పెట్టి వెళ్లిపోయారు... నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మదిరిగిపోవడం ఖాయం. ఇవాళ యావత్ దేశం మన నమో వెంట నిలుస్తోంది. కేంద్రం ఇవాళ కులగణన చేయాలని నిర్ణయించింది. ఇది ఒక నిర్ణయం కాదు... ఇది ఒక సంచలనం. కులగణన చేయడానికి చాలామంది దశాబ్దాలుగా వెనుకాడుతుంటే, మన నమో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. 

నమోకు మన అమరావతి అంటే ఎంతో ప్రేమ. ఆయన ఢిల్లీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మన అమరావతి కోసం వచ్చారు. ఆయన ఏపీకి కావాల్సినవన్నీ అందిస్తున్నారు, కోరిన కోర్కెలు తీర్చుతున్నారు. మొన్ననే విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ, నక్కపల్లి డ్రగ్ పార్క్ కు నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకున్నారు. ఇప్పుడు అమరావతి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు" అని లోకేశ్ వివరించారు.

ఇప్పుడు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రెండూ పవర్ ఫుల్ ఇంజిన్లు. ఒక పక్క పవర్ ఫుల్ ఇంజిన్ నమో, మరో పక్క మన చంద్రబాబు గారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన చంద్రబాబు, పవనన్న. ఇక మనకు తిరుగు లేదు. 

20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. 1,85,000 కోట్లు పెట్టుబడి, 57 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నం రాబోతుంది. 1,36,000 కోట్లు పెట్టుబడి, 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఆర్సెలర్ మిట్టల్ అనకాపల్లికి రాబోతుంది. 

రూ.97,000 కోట్లు పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బిపీసీఎల్ రామాయపట్నంకి రాబోతుంది. తిరుపతి జిల్లాకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కర్నూలు, కడప, అనంతపురంకు రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశంకు రిలయన్స్ సీబీజీ... ఉత్తరాంధ్రకు ఫార్మా, ఐటీ... ఇలా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయబోతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Amaravati
Narendra Modi
Pakistan
India-Pakistan relations
Jammu and Kashmir
Pulwama attack
Missile
Caste Census
Andhra Pradesh

More Telugu News