Narendra Modi: అమరావతి పునర్ నిర్మాణానికి బటన్ నొక్కిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Amaravati Projects
  • నేడు అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం
  • రాజధాని అమరావతిలో భారీ సభ
  • లక్షలాది మంది సమక్షంలో రాజధాని పనులకు శ్రీకారం చుట్టిన మోదీ
ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రారంభోత్సవం చేశారు. ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో, సభా వేదిక పైనుంచే రాజధాని పునర్ నిర్మాణ పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. 

బటన్ నొక్కి రాజధాని పనులు సహా మొత్తం రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో రాజధాని పనుల విలువ రూ.49,040 కోట్లు. రూ.8 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఇవాళ్టి కార్యక్రమంలో మొత్తంగా 18 ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు.
Narendra Modi
Amaravati
Andhra Pradesh
Capital City
Project Inauguration
India
Development Projects
Government Schemes
Infrastructure Development
Modi's Visit

More Telugu News