Narendra Modi: గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికిన చంద్రబాబు, పవన్

Chandrababu Naidu Pawan Kalyan Bid Farewell to PM Modi at Gannavaram Airport
  • అమరావతి పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మోదీ
  • అనంతరం ఢిల్లీకి పయనం
  • గన్నవరం ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికిన కూటమి పెద్దలు
ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కూటమి నేతల్లో సంతోషం ఉప్పొంగుతోంది. కాగా, సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు కూటమి పెద్దలు ఘనంగా వీడ్కోలు పలికారు. 

ప్రధాని మోదీకి వీడ్కోలు పలకడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. ప్రధానికి వీడ్కోలు పలికిన వారిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మోదీకి వీడ్కోలు పలికే కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 మంది రాష్ట్ర బీజేపీ నేతలకు కూడా అవకాశం లభించింది.
Narendra Modi
Chandrababu Naidu
Pawan Kalyan
Amaravati
Gannavaram Airport
Andhra Pradesh
BJP
AP Capital
Modi's Visit
Political Leaders

More Telugu News