Narendra Modi: ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో ఆసక్తికర ఫొటోలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి అభివృద్ధి పనుల్లో భాగంగా, రూ. 58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా కూటమి నేతలు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు. సభ ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నయి.




































