Virat Kohli: నటి అవనీత్ పోస్టును లైక్ చేసి.. వివరణ ఇచ్చిన విరాట్ కోహ్లీ

Virat Kohli Explains Instagram Like to Avneet Kaurs Post
  • విరాట్ ఇన్‌స్టా లైక్‌పై సామాజిక మాధ్యమంలో చర్చ
  • మొదట లైక్ చేసి ఆ తర్వాత లైక్‌ను తొలగించిన కోహ్లీ
  • పొరపాటున లైక్ చేసినట్లు విరాట్ కోహ్లీ స్పష్టీకరణ
  • అల్గారిథమ్ సమస్యే కారణమని వివరణ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ను ఆయన లైక్ చేసి, వెంటనే దానిని తొలగించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగడంతో, విరాట్ కోహ్లీ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు.

ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ తొలుత లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించారు. అయితే, కొద్దిసేపటికే ఆ లైక్‌ను ఆయన తొలగించారు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో, కోహ్లీ ఫ్యాన్ పేజీల్లో షేర్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.

వివరణ కోహ్లీ

తన ఇన్‌స్టాగ్రామ్ చర్యపై జరుగుతున్న చర్చకు ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో విరాట్ కోహ్లీ తాజాగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్న సమయంలో ఇది పొరపాటున జరిగినట్లుంది. అల్గారిథమ్ వల్ల ఈ ఇంటరాక్షన్ (లైక్) పొరపాటున నమోదై ఉండవచ్చు. దీని వెనుక నా వైపు నుంచి ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి దీనిపై అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని కోహ్లీ తన స్టోరీలో పేర్కొన్నారు.
Virat Kohli
Avneet Kaur
Instagram
Like
Social Media
Viral
Indian Cricketer
Bollywood Actress
Algorithm
Accidental Like

More Telugu News