Manchu Vishnu: పహల్గామ్ ఉగ్రదాడి మృతుడు మధుసూదన్ కుటుంబానికి మంచు విష్ణు ఆసరా

Manchu Vishnu Offers Support to Family of Pahalgham Attack Victim
  • పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూధన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన నటుడు మంచు విష్ణు
  • మధుసూధన్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటన
  • విద్యాభ్యాసం, ఇతర అవసరాల సంపూర్ణ బాధ్యత తీసుకుంటానని వెల్లడి
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను ఆయన నిన్న పరామర్శించారు.

మధుసూధన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంచు విష్ణు.. మధుసూధన్ భార్య కామాక్షి, వారి ఇద్దరు పిల్లలను ఓదార్చారు. ఈ విషాదం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్న విష్ణు.. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మధుసూధన్ పిల్లల బాధ్యతను తాను స్వీకరిస్తానని ప్రకటించారు.

మధుసూధన్ ఇక లేరనే నిజాన్ని ఒప్పుకోవడం కష్టంగా ఉన్నా వారి పిల్లల భవిష్యత్తు కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారిని దత్తత తీసుకుని, వారి విద్యాభ్యాసం మొదలుకుని ఇతర అవసరాల విషయంలో బాధ్యత వహిస్తానని విష్ణు హామీ ఇచ్చారు.

కాగా, మధుసూధన్ గత 12 ఏళ్లుగా బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుండగా, అతని తల్లిదండ్రులు తిరుపాలు, పద్మావతి దంపతులు కావలిలో అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 
Manchu Vishnu
Pahalgham Terrorist Attack
Madhusudhan Rao
Family Support
Tollywood Actor
Kavali
Nelluru District
Software Engineer
Financial Aid
Child Welfare

More Telugu News