India: పాక్ కు మరో షాకిచ్చిన కేంద్రం.. దిగుమతులపై నిషేధం

India Bans Imports From Pakistan
  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ పై కఠిన చర్యలు
  • మేడిన్ పాక్ వస్తువులకు భారత్ లో చోటులేదని వెల్లడి
  • జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం
  • వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్.. వెంటనే అమలులోకి వచ్చిన నిషేధం
పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. దీని వెనక పాక్ ఉందని ఆరోపిస్తూ ఆ దేశంపై కఠిన చర్యలు చేపట్టింది. జాతీయ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.

పాకిస్థాన్ నుంచి నేరుగా గానీ లేదా పరోక్షంగా గానీ వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మేడిన్ పాకిస్థాన్ వస్తువులకు భారత్ లో చోటులేదని, అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువునైనా భారత్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న సరుకులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.

"పాకిస్థాన్ మూలం ఉన్న లేదా అక్కడి నుంచి ఎగుమతి అయిన ఏ వస్తువైనా సరే భారతదేశంలోకి అనుమతించబోం.. అన్ని వస్తువుల దిగుమతి లేదా రవాణాపై నిషేధం అమలు చేస్తున్నాం. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ ఆంక్షలు విధించబడ్డాయి" అని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
India
Pakistan
Import Ban
Trade Restrictions
National Security
Pulwama Attack
Government of India
Bilateral Relations
India-Pakistan Relations
Economic Sanctions

More Telugu News