Hyderabad: హైద‌రాబాద్‌లో దారుణ ఘ‌ట‌న‌.. బాలుడిపై యువ‌తి లైంగికదాడి

Hyderabad Shocker Minor Boy Sexually Assaulted by 28 Year Old Woman
  • న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న
  • 16 ఏళ్ల మైన‌ర్ బాలుడిపై 28 ఏళ్ల యువ‌తి ప‌లుమార్లు లైంగికదాడి
  • రోజురోజుకూ ఆమె వేధింపులు ఎక్కువ కావ‌డంతో భ‌రించ‌లేక పేరెంట్స్‌కు చెప్పిన బాలుడు
  • బాధితుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో వెలుగులోకి షాకింగ్ ఘ‌ట‌న‌
హైద‌రాబాద్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 16 ఏళ్ల మైన‌ర్ బాలుడిపై 28 ఏళ్ల యువ‌తి ప‌లుమార్లు లైంగికదాడికి పాల్ప‌డింది. న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... జూబ్లీహిల్స్ లో నివాసం ఉండే 28 ఏళ్ల ఓ యువ‌తి... త‌న ఇంటి ప‌క్క‌న ఉండే 16 ఏళ్ల‌ బాలుడితో ప‌రిచ‌యం పెంచుకుంది. ఆ త‌ర్వాత త‌న ఇంటికి పిలిచిన ఆమె బాలుడిని మాయ‌మాట‌లు చెప్పి లోబ‌రుచుకుంది. 

అలా ప‌లుమార్లు త‌న ఇంట్లోనే మైన‌ర్‌పై ఆమె లైంగిక‌దాడికి పాల్ప‌డింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే త‌న‌పై అత్యాచారం చేశావ‌ని చెబుతానంటూ బాలుడిని బెదిరించింది. దాంతో భ‌య‌ప‌డిపోయిన బాలుడు ఈ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేదు. తాజాగా మ‌రోసారి అత‌నిపై లైంగిక దాడికి పాల్ప‌డిందామె. అలాగే అస‌భ్య‌క‌ర‌మైన ప‌నులు చేయాలంటూ బాలుడిని బ‌ల‌వంతం చేసింది. 

రోజురోజుకూ ఆమె వేధింపులు ఎక్కువ కావ‌డంతో భ‌రించ‌లేక‌పోయిన మైన‌ర్‌... త‌న‌పై గ‌తకొంత‌కాలంగా యువ‌తి చేస్తున్న దారుణాన్ని పేరెంట్స్‌కు చెప్పాడు. దాంతో బాలుడి త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బాధిత బాలుడి పేరెంట్స్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు యువ‌తిపై పోక్సో కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.   


Hyderabad
Minor Boy Sexual Assault
Jubilee Hills Sexual Assault
28-Year-Old Woman Arrested
POSCO Act
Child Sexual Abuse
Hyderabad Crime News
Minor Boy
Sexual Assault Case
Telangana Police

More Telugu News