K.A. Paul: పహల్గామ్ ఉగ్రదాడి గురించి అమెరికాకు తెలుసు.. నివేదిక ఉంది: కేఏ పాల్

- ఉగ్రదాడి గురించి పూర్తి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ వద్ద ఉందన్న పాల్
- ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారో నివేదికలో ఉందని వ్యాఖ్య
- ఈ దాడి ఎవరి కొరకు చేశారో కూడా ఉందన్న పాల్
పహల్గామ్ ఉగ్రదాడి గురించి అమెరికాకు తెలుసని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ వద్ద ఉందని అన్నారు. పహల్గామ్‌లో దాడులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వారి వెనుక ఎవరున్నారనే విషయాలు అమెరికా నివేదికలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ దాడి ఎవరు, ఎవరి కోసం చేశారనే వివరాలు కూడా నివేదికలో ఉన్నాయని తెలిపారు.
వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టును టర్కీలోని సౌదీ ఎంబసీలోనే ముక్కలు ముక్కలు చేశారని, అది చేయించింది ఎవరు, చేసింది ఎవరో కూడా అందరికీ తెలుసని అన్నారు. ఈ దుర్ఘటనను ప్రపంచమంతా ఖండించిందని, కానీ ట్రంప్ మాత్రం మిలియన్ల డాలర్లు తీసుకొని సౌదీని కాపాడారని ఆరోపించారు. రాజకీయాల్లో డబ్బుతో ఎవరినైనా కొనేసే కుట్రలు చేస్తున్నారని, ఆ చట్టాన్ని కూడా డబ్బుతో కొనేస్తున్నారని విమర్శించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ, రష్యా ఆక్రమించిన 20 శాతం ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యాకు ఇచ్చేయాలని ట్రంప్ మాట్లాడుతున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ట్రంప్ ప్రకారం చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చేయాలా అని ప్రశ్నించారు. ఆ విషయానికి వస్తే చైనా ఆక్రమించిన హాంకాంగ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రాంతాలను కూడా ఆ దేశానికే ఇచ్చేయాలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.