Chandrababu Naidu: ఇక అంతా మీ చేతుల్లో ఉంది: మంత్రి నారాయణతో సీఎం చంద్రబాబు

Its All in Your Hands Now CM Chandrababu Naidu with Minister Narayana
  • అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ సభ విజయంపై సీఎం హర్షం
  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • మోదీ మద్దతు, వ్యాఖ్యలతో రాష్ట్రానికి భరోసా లభించిందన్న సీఎం
  • సభ విజయానికి సమష్టి కృషి కారణమని నేతలకు అభినందనలు.
  • మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి నారాయణకు నిర్దేశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి ఆవశ్యకతను చాటిచెప్పేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులను పునఃప్రారంభించినట్లు సీఎం స్పష్టం చేశారు. మూడేళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని సూచించారు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్ధేశించారు.

"అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమైంది. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే ప్రధాని చేతుల మీదుగా పనులు పున:ప్రారంభించాం. అమరావతి ఒక నగరం కాదు... ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయి. 

నిన్నటి సభతో అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.  దేశానికి అమరావతి రోల్ మోడల్‌గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వ కారణం. ప్రధాని మోదీ ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. మంత్రులు, నేతలకు అప్పగించిన పనులను బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పని చేశారు. లక్షల మంది ప్రజలు పోటెత్తినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పధంతో కార్యక్రమం జరిగింది. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసింది" అని చంద్రబాబు అభినందించారు

మంత్రులు స్పందిస్తూ.. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంత్రులు పార్థసారధి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, నారాయణ సీఎంతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Narendra Modi
Capital City
Development
Minister Narayana
Teleconference
Construction
Role Model

More Telugu News