Raja Singh: టైంపాస్ మీటింగ్‌లు వద్దు.. అధ్యక్షుడిని త్వరగా ఎన్నుకోండి: అధిష్ఠానానికి రాజాసింగ్ విజ్ఞప్తి

Raja Singh Urges BJP High Command for Speedy Telangana President Appointment
  • తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని రాజాసింగ్ విజ్ఞప్తి
  • పార్టీ సమావేశాలను 'టైం పాస్'గా అభివర్ణన, విసుగు వ్యక్తం
  • జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే రాష్ట్ర చీఫ్ నియామకంపై స్పష్టత
  • జాతీయ అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానంలో ఇంకా కొనసాగుతున్న మంతనాలు
  • ఆర్ఎస్ఎస్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం
తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు అంశం మరోమారి చర్చనీయాంశమైంది. పార్టీ సీనియర్ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని వేగవంతం చేయాలని ఆయన బీజేపీ అధిష్ఠానానికి కీలక విజ్ఞప్తి చేశారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన రాజాసింగ్, పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగా వెలిబుచ్చారు. ఈ సమావేశాలను ఆయన 'టైం పాస్ మీటింగ్స్'గా అభివర్ణించారు. ఇలాంటి సమావేశాలతో తాను అలసిపోయానని, ఆదివారం కూడా మరో 'టైం పాస్' సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. రాష్ట్ర పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామక ప్రక్రియకు మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా జాతీయ అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేసి, ఆ తర్వాత పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించాలని అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Raja Singh
BJP Telangana
Telangana BJP President
BJP leadership change
Goshamahal MLA
Time Pass Meetings
Telangana Politics
BJP National President Election
Party Meetings

More Telugu News