Monique Jeremiah: కొత్త ఐడియా... ఇలా కూడా సంపాదిస్తారా?

Woman Earns 985 a Month Renting Half Her Bed
  • నియమాలు పాటిస్తూ బెడ్ కూడా షేర్ చేసుకోవచ్చన్న క్వీన్ ల్యాండ్ మహిళ మోనిక్ జెరెమియా
  • తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లు (రూ.54వేలు) ఆదాయం పొందుతున్న జెరెమియా
  • డబ్బు సంపాదనకు హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని వెల్లడి
సాధారణంగా ఇల్లు, కారు, బైక్, స్థలాలు, షాపులు అద్దెకు ఇస్తుంటారు. ఆ అద్దెల ద్వారా ఆదాయం పొందుతుంటారు. అయితే ఓ మహిళ తాను పడుకునే మంచంలో సగం అద్దెకు ఇచ్చి సంపాదిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

క్వీన్‌లాండ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ మోనిక్ జెరెమియా.. హాట్ బెడ్డింగ్ అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం హాట్ టాపిక్ అయింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లు (రూ.54 వేలు) సంపాదిస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది తన ఆలోచనగా ఆమె చెబుతోంది.

హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని ఆమె నమ్ముతోందట. తనలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని ఆమె చెబుతోంది.

2020 కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోయి ఒంటరిగా ఉన్న సమయంలో ఈ హాట్ బెడ్డింగ్ ఆలోచన తనకు వచ్చిందని ఆమె పేర్కొంది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసిన వాడేనని, అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది అనిపించలేదని జెరెమియా చెప్పింది. 

ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ, నియమాలను గౌరవించుకుంటే ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లుగానే బెడ్ షేర్ చేసుకోవచ్చని చెబుతోంది. కష్ట సమయంలో డబ్బు సంపాదనకు హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గమని ఆమె వెల్లడించింది. 
Monique Jeremiah
Hot Bedding
Rent a Bed
Unusual Income
Australia
Queensland
Sapiosexual
Unique Business Idea
Money Making Trends

More Telugu News