Volodymyr Zelenskyy: రష్యాకు వెళితే మీ ప్రాణాలకు హామీ ఇవ్వలేను.. దేశాధినేతలకు జెలెన్ స్కీ వార్నింగ్

Zelenskyy Warns Foreigners Against Russia Trip
  • విక్టరీ డే వేడుకల వేళ విదేశీ అతిథులకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ హెచ్చరిక
  • ఈ వేడుకల నిర్వహణ కోసం రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదన
  • కుదరదని తేల్చిచెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
  • అదే జరిగితే మే 10న కీవ్ లో ఎవరూ మిగలరని రష్యా ఘాటు జవాబు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా ‘విక్టరీ డే’ ను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ నెల 9న విక్టరీ డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేశారు. విక్టరీ డే వేడుకల కోసం రష్యా వెళ్లే విదేశీ ప్రముఖుల ప్రాణాలకు హామీ ఇవ్వలేమని వార్నింగ్ ఇచ్చారు. అతిథులకు రక్షణ కల్పించే బాధ్యత రష్యాదే కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగితే తమకు బాధ్యత లేదని తేల్చిచెప్పారు.

రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాల్లో నిరంతరం బాంబులు పేలుతున్నాయి. భారీ విధ్వంసం జరుగుతోంది. వైమానిక దాడులు, డ్రోన్ అటాక్ లు సాధారణంగా మారాయి. ఈ క్రమంలో విక్టరీ డే వేడుకల కోసం రష్యా కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. మూడు రోజుల పాటు కాల్పులు, బాంబు దాడులు ఆపేద్దామని ఉక్రెయిన్ కు సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను జెలెన్ స్కీ తోసిపుచ్చారు. అమెరికా చెప్పినట్లు నెల రోజుల పాటు కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు.

అంతే కానీ రెండు రోజులు, మూడు రోజులు కాల్పులు ఆపేద్దామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తాజాగా ఈ బెదిరింపులపై రష్యా స్పదించింది. ‘కవ్వింపులు వాస్తవంలోకి మారితే.. మే 10న కీవ్‌లో ఎవరూ ఉదయాన్ని చూడలేరు’ అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు.
Volodymyr Zelenskyy
Russia
Ukraine
Victory Day
Russia-Ukraine War
Zelenskyy Warning
Kremlin
Dmitry Peskov
International Relations
May 9th

More Telugu News