Trisha: త్రిష బ‌ర్త్‌డే ట్రీట్‌.. 'విశ్వంభ‌ర' నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌

Trishas Birthday Treat New Poster from Chiranjeevis Vishvambera
  • చిరంజీవి, వశిష్ట కాంబినేష‌న్‌లో ‘విశ్వంభ‌ర’ 
  • చిరు స‌ర‌స‌న హీరోయిన్‌గా త్రిష‌
  • నేడు త్రిష పుట్టిన‌రోజు.. మూవీలోని ఆమె పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’. ఈ మూవీ నుంచి తాజాగా కొత్త పోస్ట‌ర్ విడుద‌లైంది. ఈరోజు హీరోయిన్ త్రిష పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె పాత్ర 'అవ‌ని'ని ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను పంచుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా చిత్రం యూనిట్ ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. చీర‌క‌ట్టులో సంప్ర‌దాయంగా చిరున‌వ్వులు చిందిస్తున్న త్రిష ఫొటో చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది. 

ఇక‌, ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘రామ రామ’ అంటూ సాగే పాట‌ను హ‌నుమాన్ జ‌యంతి కానుక‌గా ఏప్రిల్ 12న విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం కీరవాణి స్వ‌రాలు స‌మ‌కూర్చిన‌ ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.

కాగా, ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. స్టాలిన్ మూవీ త‌ర్వాత‌ మెగాస్టార్ స‌ర‌స‌న మ‌రోసారి త్రిష‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఆషికా రంగ‌నాథ్‌, బాలీవుడ్ న‌టుడు కునాల్ క‌పూర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
Trisha
Trisha Krishnan
Chiranjeevi
Vishvambera
New Poster
Movie Poster Release
Tollywood
Telugu Cinema
UV Creations
M.M. Keeravani

More Telugu News