TTD: టీటీడీ కల్యాణ వేదిక కార్యక్రమానికి భారీ స్పందన

TTD Kalyan Vedika Witnessing Huge Response
  • 2016 ఏప్రిల్ 25న టీటీడీ ప్రారంభించిన కల్యాణ వేదిక
  • ఈ ఏడాది మే 1 వరకూ ఆ పథకం కింద 26,214 వివాహాలు జరిగాయన్న టీటీడీ
  • తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదిక వద్ద వివాహాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న కల్యాణ వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదిక వద్ద 2016 ఏప్రిల్ 25 నుంచి టీటీడీ వివాహాలు నిర్వహిస్తోంది. ఈ వివాహాలకు వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని నిబంధన విధించారు. ఒకవేళ వారు రాలేని పరిస్థితుల్లో ఉంటే, అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ పథకం ప్రారంభించిన తర్వాత, ఈ ఏడాది మే 1 వరకు 26,214 వివాహాలు జరిగినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ పథకం ద్వారా వివాహానంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అనంతరం ఉచితంగా ఆరు లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద అందజేస్తున్నారు.

ఈ పథకం కింద తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది. ఇందుకోసం తమ సమీప ప్రాంతాల్లోని నెట్ సెంటర్లలో టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని, ఇతర వివరాలకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ నెం. 0877 2263433ని సంప్రదించవచ్చని తెలిపింది. 
TTD
Tirumala Tirupati Devasthanams
Kalyan Vedika
Tirumala marriages
wedding ceremonies
Andhra Pradesh
religious weddings
free darshan
laddu
online registration

More Telugu News