Benjamin Netanyahu: ఒక్క బాంబు వేసి సరిపెట్టం.. హౌతీలకు నెతన్యాహు తీవ్ర హెచ్చరిక

Netanyahus Stern Warning to Houthis After Ben Gurion Airport Missile Attack
  • టెల్ అవీవ్ ఎయిర్ పోర్ట్ పై దాడికి తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని
  • దేశంలోని ప్రధాన విమానాశ్రయంపై క్షిపణి దాడితో ప్రయాణికుల్లో ఆందోళన
  • హౌతీ క్షిపణి దాడితో రన్ వే పై సుమారు 25 మీటర్ల భారీ గుంత
టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై క్షిపణి దాడికి పాల్పడిన హౌతీలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి ఒక్క బాంబు వేసి సరిపెట్టబోమని, తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హౌతీలను ఉద్దేశిస్తూ.. "మేం వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాం. గతంలోనూ తీసుకున్నాం, భవిష్యత్తులోనూ తీసుకుంటాం. అమెరికాతో సమన్వయం చేసుకుంటూ మేం దీనిపై పనిచేస్తున్నాం. ఇది ఒక్కసారి జరిగే చర్య కాదు, తీవ్రమైన దాడులు ఉంటాయి" అని నెతన్యాహు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. కాగా, యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని అడ్డగించేందుకు ప్రయత్నించామని, అయితే దాని శకలాలు బెన్ గురియన్ విమానాశ్రయం ప్రాంతంలో పడ్డాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

హౌతీల క్షిపణి దాడితో బెన్ గురియన్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. క్షిపణి దాడి జరిగిన ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. రన్ వే పై దాదాపు 25 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడిందని అధికారులు తెలిపారు. టెర్మినల్ భవనంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితేదాడి జరిగిన అరగంట వ్యవధిలోనే ఎయిర్ పోర్ట్‌ లో తిరిగి విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. అయితేభద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా, డెల్టా ఎయిర్ లైన్స్, లుఫ్తాన్సా సహా పలు విదేశీ విమానయాన సంస్థలు టెల్ అవీవ్‌కు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
Benjamin Netanyahu
Houthi rebels
Israel
Ben Gurion Airport
missile attack
Tel Aviv
Yemen
IDF
military retaliation
international flights

More Telugu News