Intiyaz Ahmad Magray: పహల్గామ్ దాడి.. తప్పించుకోవడానికి నదిలోకి దూకి ప్రవాహ వేగంతో మృతి... వీడియో ఇదిగో!

Intiyaz Ahmad Magray Dies After Jumping into River in Jammu and Kashmir
  • కుల్గాంలో ఉగ్రవాదులకు సహకరించిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అరెస్ట్
  • భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు వేషా నదిలోకి దూకిన వైనం
  • నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి చెందిన ఇంతియాజ్
  • స్వయంగా దూకినట్లు వీడియోలో స్పష్టం, బలగాల ప్రమేయం లేదని నిర్ధారణ
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయం చేశాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న వ్యక్తి, భద్రతా బలగాల నుంచి తప్పించుకొని నదిలో దూకి మృతి చెందాడు. ఈ ఘటనపై మొదట భద్రతా దళాలపై విమర్శలు వచ్చినప్పటికీ, అతడు స్వయంగా నదిలోకి దూకినట్లు చూపుతున్న వీడియో బయటకు రావడంతో ఆ ఆరోపణలు నిరాధారమని తేలింది.

వివరాల్లోకి వెళితే, కుల్గాం జిల్లాకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23) అనే యువకుడిని ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో, తాను కుల్గాంలోని టాంగ్‌మార్గ్‌ అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంతో పాటు ఇతర సహాయాలు అందించినట్లు ఇంతియాజ్ అంగీకరించాడు. అనంతరం, ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాన్ని చూపిస్తానని, వారిని పట్టుకోవడంలో సహకరిస్తానని భద్రతా బలగాలకు తెలిపాడు.

దీంతో ఆదివారం ఉదయం పోలీసులు, ఆర్మీ సిబ్బంది అతడిని వెంటబెట్టుకుని ఆ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ క్రమంలో వేషా నది సమీపానికి చేరుకోగానే, ఇంతియాజ్ ఒక్కసారిగా భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నదిలోకి దూకేశాడు. అయితే, నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో అతడు వేగంగా కొట్టుకుపోయాడు. ఈత కొట్టి ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రవాహవేగానికి తట్టుకోలేక నీటిలో మునిగిపోయి మరణించాడు.

ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది. తాజాగా ఆ వీడియో బయటకు వచ్చింది. అందులో, ఇంతియాజ్ ఎవరి బలవంతం లేకుండా, తనంతట తానుగానే నదిలోకి దూకుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో భద్రతా బలగాల ప్రమేయంపై వచ్చిన అనుమానాలకు తెరపడింది.
Intiyaz Ahmad Magray
Jammu and Kashmir
Kulgam
Terrorist Aid
River Death
Security Forces
Video Evidence
India
Kashmir
Veshaw River

More Telugu News