KTR: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. స్పందించిన కేటీఆర్

KTR Responds to Revanth Reddys Remarks on Telanganas Financial Condition
  • తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టీకరణ
  • 'చీప్ మినిస్టర్'  అంటూ చురక
  • మేధోపరంగా, నైతికంగా కాంగ్రెస్ దివాలా తీసిందని ఆరోపణ
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. తెలంగాణ దివాలా తీసిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. "రాష్ట్రం దివాలా తీయలేదు. మిస్టర్ 'చీప్ మినిస్టర్'. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే" అంటూ ఘాటుగా విమర్శించారు.
KTR
Revanth Reddy
Telangana Finance
Telangana Economy
TRS
Congress Party
Telangana CM
Indian Politics
State Budget
Financial Crisis

More Telugu News