Mohammed Shami: చంపేస్తామంంటూ మహమ్మద్ షమీకి బెదిరింపులు

Mohammed Shami Receives Death Threats via Email
  • ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరుడు
  • కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు వెల్లడి
  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీకి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. షమీని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించడమే కాకుండా, రూ. 1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై షమీ తరఫున అతడి సోదరుడు హసీబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షమీ సోదరుడు హసీబ్ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు, రాజ్‌పుత్ సిందార్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఈమెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశాలు వచ్చినట్లు గుర్తించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

ఈ బెదిరింపుల వెనుక ఉన్న కారణాలు, నిందితుల పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

ఇటీవల గౌతమ్ గంభీర్‌కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 'నిన్ను చంపేస్తాం' అంటూ రెండుసార్లు వేర్వేరు ఈమెయిల్స్ రావడంతో గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షమీ ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నారు.
Mohammed Shami
Death Threats
IPL
Cyber Crime
Email Threats
Indian Cricketer
Sunrisers Hyderabad
Hasib Shami
Gautam Gambhir
Amroha Police

More Telugu News