Trivikram Srinivas: ఆయన కారణంగానే సినిమా పాటలంటే ఇష్టం ఏర్పడింది: త్రివిక్రమ్

Trivikram reveals Sirivennela Seetharama Sastrys impact on his love for film songs
  • సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నిపాటలను ఒకేలా చూస్తారు, ప్రేక్షకులకు నచ్చేలా రాయడమే ఆయన గొప్పతనమన్న త్రివిక్రమ్ శ్రీనివాస్
  • సిరివెన్నెల సినిమాలో రాసిన విధాత తలపున పాట విని మైండ్ బ్లాంక్ అయిందని వెల్లడి
  • ఆయన రాసిన పాటల్లో విధాత తలపున పాట చాలా గొప్పదన్న త్రివిక్రమ్
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కారణంగానే తనకు సినిమా పాటలంటే ఇష్టం ఏర్పడిందని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. సిరివెన్నెల, త్రివిక్రమ్ మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినంతగా ఇప్పటి వరకూ ఎవరూ చెప్పి ఉండరు. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది.

తాజాగా మరోసారి సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక విషయాలను పంచుకున్నారు. తాను సినీ ఇండస్ట్రీకి రాకముందు వరకూ పాటలు పెద్దగా నచ్చేవి కావని, అలాంటి సమయంలో సిరివెన్నెల సినిమాలోని 'విధాత తలపున' పాట విని మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ఆ పాట తనను విపరీతంగా ఆకట్టుకుందన్నారు. అందులోని పదాలకు అర్థం వెతకడం కోసం డిక్షనరీ తిరగేశానని, తెలుగు పదాలకు కూడా డిక్షనరీ ఉంటుందని అప్పుడే తనకు తెలిసిందని అన్నారు.

అయితే ఆ పాట తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలు ఎందుకో అంత గొప్పగా అనిపించలేదన్నారు. ఇప్పటికీ ఆయన రాసిన పాటల్లో 'విధాత తలపున' పాట చాలా గొప్పదిగా అనిపిస్తుందన్నారు. అందరికీ అర్థమయ్యేలా పాటలు రాయడానికి ఆయన ఎన్నో తేలికైన పదాలు వాడటం ప్రారంభించారన్నారు. అంతే కాకుండా తన సినిమాల్లోని సీన్లకు ఒక్కోసారి చాలా వెర్షన్లు రాసేవారన్నారు.

జల్సా మూవీలోని 'ఛలోరే ఛలోరే' అనే పాటకు 30 వెర్షన్లు రాశారని, అందులో తాను రెండు మాత్రమే తీసుకున్నానని తెలిపారు. ఆయన అన్ని పాటలను ఒకేలా చూస్తారని, ప్రేక్షకులకు నచ్చేలా రాయడమే ఆయన గొప్పతనమని త్రివిక్రమ్ పేర్కొన్నారు. 
Trivikram Srinivas
Sirivennela Seetharama Sastry
Telugu Cinema
Film Songs
Lyricist
Director
Vidhata Talapuna
Jalsa Movie
Chalora Chalora
Tollywood

More Telugu News