Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డిని అభినందించిన చంద్రబాబు, లోకేశ్ .. ఎందుకంటే..?

Chandrababu Naidu Lokesh Congratulate Nellore MLA Kotamreddy
  • ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి బుక్‌లెట్ అందజేత
  • ఈ నెల 15న అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు, నారా లోకేశ్‌కు వివరించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక బుక్‌లెట్‌ను ముద్రించారు.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న 339 అభివృద్ధి పనుల గురించి వివరించారు. మే 15న ఆయా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభినందించారు.

అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి అందుకు సంబంధించిన బుక్‌లెట్‌ను అందజేశారు.

ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పంచుకున్నారు. నియోజకవర్గంలో ఇంతటి అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లకు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు. 
Kotamreddy Sridhar Reddy
Nara Chandrababu Naidu
Nara Lokesh
Nellore Rural MLA
Andhra Pradesh Politics
Development Projects
Booklet on Development
AP Politics
MLA felicitated

More Telugu News