India-Pakistan tensions: భారత్ ప్రతీకార దాడి ఎప్పుడు చేస్తుందంటే.. పాక్ మాజీ హైకమిషనర్ సంచలన ట్వీట్

Indias Retaliatory Strike Pak Ex High Commissioners Sensational Tweet
--
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ దాడులకు దిగుతుందని ఆ దేశ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులకు సంబంధించి అంచనాలతో ఆయన మంగళవారం సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే పరేడ్ తర్వాత భారత్ దాడులకు దిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ దేశాధినేతలకు ఆహ్వానం పంపింది. తొలుత ఈ వేడుకలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు.

అయితే, పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టనపెట్టుకోవడంతో రష్యా పర్యటన ప్లాన్ ను రద్దు చేసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను పంపించాలని భావించినా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా వెళ్లే అవకాశంలేదని తెలుస్తోంది. ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై పోరులో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాతో పాటు భారత్ లోనూ పాక్ రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే పరేడ్ తర్వాత.. అంటే ఈ నెల 10న కానీ, 11 న కానీ పాక్ పై భారత్ దాడి చేస్తుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
India-Pakistan tensions
Pahalgam attack
Pakistan
Abdul Basit
India
Retaliatory strike
Russia Victory Day Parade
Narendra Modi
Vladimir Putin
Terrorism

More Telugu News