Revanth Reddy: నేను చెప్పిందే నిజమైంది... రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి: జగదీశ్ రెడ్డి

Revanth Reddy Should Resign Jagadish Reddy
  • రేవంత్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గి, మంత్రుల ఆదాయం పెరిగిందని ఆరోపణ
  • హామీల నుంచి తప్పించుకునేందుకే సీఎం వ్యాఖ్యలని విమర్శ
  • తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, తక్షణమే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము మొదటి నుంచి చెబుతున్న విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, రేవంత్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పెరిగిన రాష్ట్ర ఆదాయం, రేవంత్ పాలనలో తగ్గిపోయిందని, మంత్రుల ఆదాయం మాత్రం పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఢిల్లీకి తరలిస్తున్నారని, సీఎం పదవి కోసం మంత్రులు పోటీపడి సంపాదిస్తున్నారని ఆరోపించారు. హామీల అమలు నుంచి తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువును బజారున పడేశారని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని అన్నారు. 
Revanth Reddy
Jagadish Reddy
Telangana CM
Telangana Politics
BRS
Indian Politics
Revanth Reddy resignation
Telangana Economy
Financial Crisis
State Finances

More Telugu News