Madhya Pradesh school fight: జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళా ప్రిన్సిపల్, ఉద్యోగిని... ఇదిగో వీడియో

Madhya Pradesh School Fight Principal and Teacher Caught on Camera
  • మధ్యప్రదేశ్ పాఠశాలలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ మధ్య ఘర్షణ
  • వాగ్వాదం ముదిరి జుట్లు పట్టుకొని కొట్టుకున్న వైనం
  • జోక్యం చేసుకుని విడదీసిన పాఠశాల సిబ్బందిలోని మహిళ
  • ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసిన విద్యాశాఖ అధికారులు
విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వారే క్రమశిక్షణ తప్పి ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ జుట్లు పట్టుకుని కొట్టుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోనే ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి, అదే పాఠశాలలో పనిచేస్తున్న మహిళా లైబ్రేరియన్ కు మధ్య ఏదో విషయంలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో, సదరు లైబ్రేరియన్ తన మొబైల్ ఫోన్‌లో ఈ వాగ్వాదాన్ని చిత్రీకరించడం ప్రారంభించారు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే ఆ ఉద్యోగినిపై చేయి చేసుకుని, ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని కింద పడేశారు.

అంతటితో ఆగకుండా, ఆ ఫోన్‌ను మళ్ళీ తీసుకుని నేలకేసి కొట్టడంతో అది పగిలిపోయింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన మహిళా ఉద్యోగిని కూడా ప్రిన్సిపాల్‌పై తిరగబడ్డారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయిచేసుకుంటూ, జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.

ఒకరిద్దరు వారిని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ, చుట్టూ ఉన్న మరికొంతమంది ఈ ఘర్షణను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. కొద్దిసేపటి తర్వాత, పాఠశాలలో పనిచేస్తున్న మరో మహిళ జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. తక్షణమే ఆ ప్రిన్సిపాల్‌ను, లైబ్రేరియన్ ను అక్కడి నుంచి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Madhya Pradesh school fight
Principal fights with teacher
Viral video of school fight
India school violence
Madhya Pradesh education
Khargaone school incident
Teacher assault
Women fight
School principal suspended

More Telugu News