Faria Abdullah: పవన్ తో డేటింగ్, ప్రభాస్ తో మ్యారేజ్... 'జాతిరత్నాలు' బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు

Faria Abdullahs Dating  Marriage Choices Pawan Kalyan  Prabhas
  • యాంకర్ సుమ టాక్ షోలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా
  • సుమ ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానమిచ్చిన టాల్ బ్యూటీ
  • ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌
  • పవన్, ప్రభాస్ అభిమానుల నుంచి విశేష స్పందన.
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజా ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ఒక ప్రముఖ చాట్ షో తాజా ఎపిసోడ్‌లో ఫరియా పాల్గొంది.

'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన నటనతో గుర్తింపు పొందిన ఫరియా అబ్దుల్లా, సుమ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ సందర్భంగా, "మీకు అవకాశం వస్తే ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు?" అని సుమ ప్రశ్నించగా, ఫరియా బదులిస్తూ, "నాకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తాను, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను" అని తడుముకోకుండా సమాధానమిచ్చింది.

ఫరియా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు వాటిని విస్తృతంగా షేర్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. తమ అభిమాన నటుల ప్రజాదరణకు ఇది నిదర్శనమని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఫరియా అబ్దుల్లా తన కెరీర్‌ను డ్యాన్సర్‌గా ప్రారంభించి, ఆ తర్వాత నటనపై ఆసక్తితో 'జాతిరత్నాలు' సినిమా ఆడిషన్‌కు హాజరయ్యారు. ఆ చిత్రంలోని 'చిట్టి' పాత్ర ద్వారా ఆమె విస్తృత ప్రజాదరణ పొందారు. ఇప్పటికీ చాలా మంది ఆమెను ఆ పాత్ర పేరుతోనే గుర్తుంచుకుంటారంటే, ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకులలోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఫరియా ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Faria Abdullah
Pawan Kalyan
Prabhas
Jati Ratnalu
Tollywood Actress
Telugu Actress
Faria Abdullah Dating
Faria Abdullah Marriage
Suma Kanakala Chat Show
Viral Interview

More Telugu News