Suspect Arrested in Pahalgam: పహల్గామ్‌ బైసరన్ లోయ సమీపంలో అనుమానిత వ్యక్తి.. అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు

Security Forces Detain Suspect After Pahalgam Attack
  • వ్యక్తి వద్ద బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ లభ్యం
  • జాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పొంతనలేని సమాధానాలు
  • తదుపరి విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగింత
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా, దాడి జరిగిన బైసరన్ లోయ సమీపంలో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పహల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తుండగా, బైసరన్ లోయ సమీపంలో ఒక వ్యక్తి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌తో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు సరైన వివరణ ఇవ్వలేకపోయాడు. దీంతో, తదుపరి విచారణ నిమిత్తం అతడిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.

కాగా, పహల్గామ్‌లోని బైసరన్ లోయ ప్రాంతంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తొలుత స్థానిక పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా, అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు బాధ్యతలు చేపట్టింది. ఎన్‌ఐఏ అధికారులు, భద్రతా సిబ్బందితో కలిసి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Suspect Arrested in Pahalgam
Pahalgam Attack
Jammu and Kashmir
Security Forces
Bulletproof Jacket
Terrorist Investigation
NIA
Paisaran Valley
Suspicious Activity
Terrorism in Kashmir

More Telugu News