Amit Shah: ఢిల్లీలో అమిత్ షా అత్యవసర సమీక్ష... రేపు అఖిలపక్ష సమావేశం

- పహల్గామ్ ఉగ్రదాడికి బదులుతీర్చుకున్న భారత్
- పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు
- ఆపరేషన్ సిందూర్ విజయవంతం
- పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాలతో సీఎంలతో అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బతీసిన భారత్ తదుపరి చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో అత్యవసర సమీక్ష చేపట్టారు. పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమీక్ష సమావేశానికి జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం సీఎంలు హాజరయ్యారు. లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రేపు ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మే 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఈ అఖిలపక్ష సమావేశంలో పంచుకోనుంది.