Vyomika Singh: ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్... ఎవరీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్?

Who is Wing Commander Vyomika Singh
  • ఆపరేషన్ సిందూర్ తో పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్
  • ఆపరేషన్ గురించి మీడియాకు బ్రీఫ్ చేసిన సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్
  • అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపిన వ్యోమిక
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులపై భారత రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ గురించి మీడియాకు వివరించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్నారు. చదువుకునే రోజుల్లోనే ఆమె ఎన్.సీ.సీ (NCC)లో చేరారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. 2019 డిసెంబర్ 18న ఆమె ఫ్లయింగ్ బ్యాచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో ఆమె చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపారు. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు.  
Vyomika Singh
Operation Sundar
Indian Air Force
Wing Commander
Pakistan
PoK
Terrorist Camps
Colonel Sofia Khureshi
Jammu and Kashmir
Heli Pilot

More Telugu News