India Civil Defence Mock Drill: దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం

Nationwide Civil Defence Mock Drill Begins in India
  • యుద్ధం వస్తే ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన పెంచే కార్యక్రమం
  • 50 ఏళ్ల తర్వాత మన దేశంలో తొలిసారి మాక్ డ్రిల్
  • దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ... ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలంతా ఎతమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే విషయంలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభమయింది. 'ఆపరేషన్ అభ్యాస్' పేరిట చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటలకు మొదలయింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ మాక్ డ్రిల్ ను దేశంలో చేపట్టారు. దేశ వ్యాప్తంగా మొత్తం 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది. 

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్, విశాఖపట్నంలో మాల్ డ్రిల్ జరుగుతోంది. హైదరాబాద్ లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్, డీఆర్డీవో, మౌలాలిలో మాక్ డ్రిల్ కొననాగుతోంది. విశాఖలో రెండు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది.
India Civil Defence Mock Drill
National Civil Defence Exercise
India-Pakistan Tension
Civil Defence Preparedness
Operation Abhyas
Hyderabad Mock Drill
Visakhapatnam Mock Drill
War Preparedness
Civil Defence Training

More Telugu News