Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ... రిమాండ్ పొడిగింపు

Vallabhaneni Vamsis Remand Extended Again
  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
  • ఈ నెల 21 వరకు వంశీ రిమాండ్ పొడిగించిన కోర్టు
  • సత్యవర్ధన్ కిడ్నిప్ కేసులో కూడా నిన్న వంశీ రిమాండ్ పొడిగింపు
మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురయింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్ ను విజయవాడలోని సీఐడీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో వంశీ రిమాండ్ గడువు ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఆయనను జిల్లా జైలు నుంచి తీసుకువచ్చి విజయవాడలోని సీఐడీ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, వంశీకి మే 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పోలీసులు ఆయనను తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

సత్యవర్థన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి నిన్న కూడా వంశీకి నిరాశే ఎదురైంది. ఈ కేసులో రిమాండ్ గడువు ముగియడంతో ఆయనను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం మే 13 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబులను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన సంగతి విదితమే. నిన్న వీరందరి రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా, వారందరికీ కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Vallabhaneni Vamsi
Remand Extension
Gannavaram TDP Office Attack
Sathyavardhan Kidnap Case
Vijayawada CID Court
SC ST Court Vijayawada
Andhra Pradesh Politics
Telugu Desam Party
Crime News Andhra Pradesh
Arrest

More Telugu News