Praveen Sood: సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్ సర్వీస్ పొడిగింపు

- ప్రవీణ్ సూద్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
- కొత్త డైరెక్టర్ ఎంపికపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సర్వీస్ పొడిగింపు
- వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉన్న పదవీకాలం
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సర్వీస్ ను కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. కొత్త సీబీఐ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ పదవీకాలం పొడిగింపునకు అపాయింట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రవీణ్ సూద్ పదవీకాలం వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉంది.
1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ గా తన పోలీస్ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.