Indian Army: పూంఛ్, తంగ్‌ధర్ సెక్టారులో రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు: ఇండియన్ ఆర్మీ

Pakistans Ceasefire Violation Indian Army Reports Casualties
  • ఎల్‌ఓసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
  • పాక్ కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి, 43 మందికి గాయాలైనట్లు వెల్లడి
  • భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత పాక్ కాల్పులు
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం భారత పౌర నివాస ప్రాంతాలే లక్ష్యంగా జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 15 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారని భారత సైన్యం వెల్లడించింది. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌'కు ప్రతిచర్యగా ఈ కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు.

గత కొంతకాలంగా ఎల్ఓసీ పొడవునా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, పహల్గామ్ ఉగ్రదాడిలో పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్‌' పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది.

ఈ దాడుల నేపథ్యంలో, బుధవారం నాడు పాకిస్థాన్ రేంజర్లు పూంఛ్, తంగ్‌ధర్ సెక్టార్లలోని భారతీయ గ్రామాలపై గుళ్ల వర్షం కురిపించారు. గత రాత్రి నుంచి ఈ కాల్పులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, సాధారణ పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ బలగాలు దాడులకు తెగబడుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.
Indian Army
Pakistan Army
Ceasefire Violation
LOC
Poonch
Tangdhar
Cross Border Firing
Kashmir
Operation Sindhu
Terrorism

More Telugu News