KKR: చెన్నై సూపర్ కింగ్స్ తో పోరు... టాస్ గెలిచిన కేకేఆర్

KKR vs CSK KKR Wins Toss Elects to Bat
 
ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన కేకేఆర్ మరేమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. 

సీఎస్కే జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో వారికి ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేదు. కానీ, కోల్ కతా జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ పోరులో గెలుపు తప్పనిసరి. అందుకే మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని, ఆ తర్వాత చెన్నై జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి రన్ రేట్ మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. 

ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులోకి వెంకటేశ్ అయ్యర్ స్థానంలో మనీష్ పాండేను తుదిజట్టులోకి తీసుకున్నారు. అటు, చెన్నై జట్టులో రెండు మార్పులు చేశారు. షేక్ రషీద్, శామ్ కరన్ స్థానంలో డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్ కు స్థానం కల్పించారు. 

కాగా, మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 4 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 11 పరుగులు చేసి అవుట్ కాగా... సునీల్ నరైన్ 6, కెప్టెన్ అజింక్యా రహానే 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
KKR
Chennai Super Kings
IPL 2023
Eden Gardens
Kolkata Knight Riders
CSK
Manish Pandey
Venkatesh Iyer
Ajinkya Rahane
IPL Match

More Telugu News