Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రస్థావరాలు నేలమట్టం.. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఉపగ్రహ చిత్రాలు

Satellite Images Reveal Operation Sindoors Impact
  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ 
  • జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం 
  • తాజాగా బయటికొచ్చిన‌ వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు
  • బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్‌లు ధ్వంసం
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ప్రతిదాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటికొచ్చాయి.

భార‌త ఆర్మీ దాడుల్లో బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత బ‌ల‌గాలు జరిపిన ఈ దాడిలో భారీగానే ఉగ్రవాదులు చ‌నిపోయినట్లు తెలుస్తోంది.  

మరోవైపు ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతిచర్యగా దాయాది పాకిస్థాన్‌ దాడులు చేసే అవకాశం ఉండటంతో భారత్‌ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్‌లో హై అలర్ట్‌ ప్రకటించింది. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. విమానాశ్రయాలను మూసివేసింది. కాగా, వ‌క్ర‌బుద్ధితో పాకిస్థాన్‌ సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. స‌రిహద్దు ప్రాంతాల్లోని అమాయ‌క ప్ర‌జ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతోంది. పాక్ కాల్పుల‌కు భార‌త సైన్యం కూడా దీటుగా బ‌దులిస్తోంది. 
Operation Sindoor
Indian Army
Pakistan
Jaish-e-Mohammed
Lashkar-e-Taiba
Hizbul Mujahideen
POK
Cross Border Firing
Satellite Images
Terrorist Camps

More Telugu News