Operation Sindoor: ఆపరేషన్ సిందూర్: 27 విమానాశ్రయాలు క్లోజ్

27 Indian Airports Closed
  • ఈ నెల 10వ తేదీ వరకు పలు విమానాలు కూడా రద్దు
  • సరిహద్దు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించిన కేంద్రం
  • ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు
పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరలపై సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పాక్ గగనతలం నుంచి ముప్పు పొంచి ఉందని దేశంలోని 27 విమానాశ్రయాలను మూసివేసింది. మొత్తంగా 430 విమానాలను రద్దు చేసింది. ఈ నెల 10 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ సైన్యం సరిహద్దుల్లోని గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది.

ఈ క్రమంలో ప్రయాణికుల విమానాలను, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే ముప్పు ఉందని కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ లలో అక్కడి ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాలతో పాటు విమానాశ్రయాలు, విద్యాసంస్థలను మూసివేశాయి.
Operation Sindoor
India Pakistan Conflict
Airport Closures
Flight Cancellations
Security Alert
Terrorist Threat
India Air Space
Cross Border Firing

More Telugu News