Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. సరిహద్దులు దాటకుండానే శత్రువుపై దాడి

Indias Operation Sindoor Neutralizes Terrorist Camps
  • భారత సరిహద్దుల్లో నుంచే క్షిపణుల ప్రయోగం
  • సైనిక క్యాంపుల జోలికి వెళ్లని భారత ఆర్మీ
  • గురి తప్పకుండా ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. పక్కా సమాచారంతో, అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. పాక్ మిలటరీ స్థావరాల జోలికి వెళ్లలేదని సైనిక వర్గాలు తెలిపాయి. సైనిక శిబిరాలపై దాడి చేస్తే యుద్ధానికి దారితీస్తుందనే ఉద్దేశంతో కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు జరిపినట్లు వివరించాయి. ఈ ఆపరేషన్ మొత్తం భారత సరిహద్దుల నుంచే నిర్వహించినట్లు తెలిపాయి.

భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను భారత గగనతలం నుంచే నిర్వహించిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సరిహద్దు నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఇందుకోసం రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు స్కాల్ఫ్ క్రూయిజ్ మిసైల్స్, ఖచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులు, మరియు హరోప్ కామికేజ్ డ్రోన్‌ల వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటితో ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసినట్లు వివరించాయి. ఇది భారతదేశం యొక్క ఉద్దేశపూర్వక, నియంత్రిత సైనిక వ్యూహాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Operation Sindoor
Indian Army
Pakistan
POK
Terrorist Camps
Surgical Strike
Rafale Jets
Scalp Cruise Missiles
Guided Bombs
Harop Kamikaze Drones

More Telugu News