Nara Rohit: హిట్‌మ్యాన్ నిర్భ‌య‌మైన స్ట్రోక్‌ల‌ను మిస్ అవుతాం: హీరో నారా రోహిత్

Hitman Retires Nara Rohits Emotional Tribute
  • అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్‌
  • సోషల్‌ మీడియా వేదికగా రిటైర్మెంట్‌పై ప్రకటన‌
  • టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌కు సినీ ప్ర‌ముఖుల విషెస్ 
  • తాజాగా టాలీవుడ్ హీరో నారా రోహిత్, హిట్‌మ్యాన్‌కు ఎక్స్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుధవారం అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా రిటైర్మెంట్‌పై ప్రకటించాడు. రోహిత్ నిర్ణయం అభిమానులను షాక్‌ గురి చేసింది. 

ఇక‌, టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ‌కు అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా విషెస్ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నారా రోహిత్, హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. 

"మీ హాస్యభరితమైన సంభాషణలు, మీ సాహసోపేతమైన నిర్ణయాలు, మైదానంలో మీ నిర్భయమైన స్ట్రోక్‌లు మాకు చాలా గుర్తుకు వస్తాయి. రోహిత్ మిమ్మల్ని వైట్ డ్రెస్‌లో ఇక చూడ‌లేము. మీ అద్భుతమైన రిటైర్మెంట్‌కు శుభాకాంక్షలు" అని నారా రోహిత్ ట్వీట్ చేశారు. 

కాగా, విరాట్ కోహ్లీ వార‌సుడిగా భార‌త టెస్ట్‌ జ‌ట్టు ప‌గ్గాలు ద‌క్కించుకున్న హిట్‌మ్యాన్... బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటన వరకు కెప్టెన్‌గా కొనసాగాడు. రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా మొత్తం 24 టెస్టులు ఆడింది. ఇందులో భార‌త్‌ 12 టెస్టులు గెలిచింది. తొమ్మిదింట్లో ఓడిపోగా.. మూడు డ్రాగా ముగిశాయి. టెస్టుల నుంచి రిటైర్‌ అయిన రోహిత్‌ వన్డేల్లో మాత్రం కనిపించనున్నాడు.
Nara Rohit
Rohit Sharma
Retirement
Test Cricket
Team India
Hitman
Bollywood
Cricket Captain
India vs Australia
Border-Gavaskar Trophy

More Telugu News